వైభవం… కార్తీక మాసోత్సవం..
1 min read– కన్నుల పండుగ కార్తీక పౌర్ణమి వేడుకలు
పల్లెవెలుగు వెబ్, చెన్నూరు: కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల కేంద్రమైన చెన్నూరు బస్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో పెన్నా నది ఒడ్డున వెలసిన మల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలను సందర్శించారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయాలను సందర్శించి ప్రత్యేక దీపాలను అలంకరించారు. ఆలయాలను సందర్శించి నా భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. పెన్నా నది సమీపంలో శివాలయం ఉండడంతో ఆలయ కమిటీ నిర్వాహకులు పెన్నా నది లోకి దిగకుండా చర్యలు చేపట్టారు. చెన్నూరు మండలం శివాలపల్లి కాశీ ఈశ్వర ఆలయం పౌర్ణమి వేడుకలు జరగలేదు. పెన్నా నదికి నీరు రావడంతో పుష్పగిరి, శివాల పల్లె మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని ఉప్పరపల్లె గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయంలో అలాగే రామన్న పల్లి గ్రామం లో వెలసిన శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో పౌర్ణమి సందర్భంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు.