NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవం.. ప్రమాణ స్వీకారోత్సవం..

1 min read
మేయర్​ సురేష్​బాబును అభినందిస్తున్న కలెక్టర్​, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే

మేయర్​ సురేష్​బాబును అభినందిస్తున్న కలెక్టర్​, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే

మేయర్​గా సురేష్​బాబు, డిప్యూటీ మేయర్​గా సయ్యద్ ముంతాజ్ బేగం
పల్లెవెలుగు వెబ్​, కడప: కడప నగర పాలక సంస్థ పాలకమండలి సభ్యులతో గురువారం కలెక్టర్​ సి. హరికిరణ్​ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం ఎస్​బీ అంజాద్​బాష, ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్​ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 డివిజన్లలో వైసీపీ ​–48 మంది, టీడీపీ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ గా ఒకరు వార్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రథమంగా 31వ డివిజన్ వార్డు సభ్యులు అజ్మతుల్లా ఖాన్ తో ప్రారంభించి ఎన్నికైనా సభ్యులందరితో వరుసగా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్​ సురేష్​బాబు, డిప్యూటీ మేయర్​ సయ్యద్​ ముంతాజ్​ బేగంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ సి. హరికిరణ్​ పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు.
రుణపడి ఉంటా… : మేయర్​ సురేష్​బాబు
ఈ సందర్భంగా మేయర్ సురేష్​బాబు మాట్లాడుతూ కడప ప్రజలకు రుణపడి ఉంటామని, నిత్యంఅందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు. కడప నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి బాటలోకి తీసుకురావాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నగరాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, అందరూ కలసి కట్టుగా కడప ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దెందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ లవన్న, తహసీల్దార్ శివరామి రెడ్డి, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author