రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలలో గోల్డ్ మెడల్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: “స్టేట్ లెవెల్ మాస్టర్స్ స్విమ్మింగ్ పోటీల్లో 1 గోల్డ్,2 సిల్వర్,1 కాంస్యము సాధించిన కె. యం.సి అనస్థీషియా డా. చందనా రాజారామ్”…. మాస్టర్స్ ఆక్వాటిక్ ఫెడరేషన్ ఇటీవల గుంటూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలలో కర్నూల్ మెడికల్ కాలేజీ అనస్తీసియా విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. చందన రాజారాం స్విమ్మింగ్ లో ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రీస్ట్ స్ట్రోక్ యందు ఒక గోల్డ్ మెడల్ రెండు సిల్వర్ మెడల్స్ ఒక కాస్యం సాధించడం పట్ల ఏడిఎంఈ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ హర్షం వ్యక్తం చేశారు. కేఎంసీ విద్యార్థులు ఉపాధ్యాయులు జాతీయ రాష్ట్రస్థాయిలో వైద్య విద్యలో ప్రతిభ కనబరచడమే కాకుండా లోనే కాకుండా విభిన్న రంగాల్లో ప్రతిభ కనపరుస్తుండడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ చేతుల మీదుగా డాక్టర్ చందన రాజారామ్ మెడల్స్ స్వీకరించడం జరిగింది.

