సౌత్ జోన్ కాన్ఫరెన్స్ లో కె.యం.సి ఈ.ఎన్.టీ పి.జి విద్యార్థుల ప్రతిభ…
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఈ.ఎన్.టీ విభాగపు అసోసియేషన్ ఆఫ్ ఓటోలారింగోలజిస్ట్స్ ఆఫ్ ఇండియా, (ఏఓఐ) ఆద్వర్యం లో ఇటీవల విజయవాడలో నిర్వహించిన సౌత్ జోన్ స్థాయి సదస్సు యందు కర్నూల్ మెడికల్ కాలేజీ యందు చదువుతున్న ఈ.ఎన్.టీ విభాగపు పీజీ తృతీయ సం. విద్యార్థిని డా. దివ్య నాగేశ్వరి క్విజ్ విభాగం లో గోల్డ్ మెడల్, టెంపొరల్ బోన్ డిషేక్షన్ యందు డా . షేఖ్ షాజియా జబీన్ సిల్వర్ మెడల్ సాధించడం పట్ల అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కే.చిట్టి నరసమ్మ సదరు విద్యార్తులను మరియు ఈ.ఎన్.టీ విభాగపు ఇన్చార్జి అధిపతి డా. హరికృష్ణ ను వారి విభాగపు వైద్యులను అభినందించారు. ప్రిన్సిపల్ ని కలిసిన వారిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లింగన్న ఎస్సార్ డా. ప్రేసి షరాన్, పి.జి లు పాల్గొన్నారు.

