NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా జెసిఎస్ కోఆర్డినేటర్ కు స్వర్ణకారుల ఘన సన్మానం 

1 min read

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి:  చాగలమర్రిలో జిల్లా గ్రామ సచివాలయాల జెసిఎస్ కోఆర్డినేటర్ గా నియామకమైన వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ ను స్థానిక స్వర్ణకారులు మంగళవారం బాణసంచా పేలుస్తూ గజమాలతో ఘనంగా సత్కరించారు.   అనంతరం  రాష్ట్ర ముస్లిం మైనారిటీ స్వర్ణకారుల సంఘంలో  వివిధ పదవులు పొందిన  స్వర్ణకారులకు వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్  మంగళవారం ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందించారు  . రాష్ట్ర ముస్లిం మైనారిటీ స్వర్ణకారుల సంఘ ఉపాధ్యక్షుడిగా ముల్లా దాదా పీర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పెద్ద వంగలి మహబూబ్ బాషా,  సహాయ కార్యదర్శులుగా సాధక్, జమాల్ భాషలు ఎన్నికయ్యారు.  ఈ కార్యక్రమంలో స్థానిక స్వర్ణకారుల సంఘం నాయకులు  ముల్లా ఖాదర్బాషా , కొత్తపల్లె అబ్దుల్లా , చాగలమర్రి స్వర్ణ కారుల  సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇసుకపల్లి అమిర్ భాష ,అధికారప్రతి నిధి డి. గౌస్ బాషా, కార్య వర్గ సభ్యులు ఖిజర్, బాబుద్దిన్ , రఫీ,  చిన్న జమాల్,స్వర్ణ కారులు మహముద్, గౌస్, మహబూబ్ హుసెన్,ఇమ్రాన్ చాగలమర్రి ఉపసర్పంచ్ షేక్ సోహెల్, మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, ఎంపీటీసీ ఫయాజ్, వార్డు సభ్యుడు షబ్బీర్,పెయింటర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author