PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భార‌త్ కు గుడ్ బై !?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ సిమెంట్‌ కంపెనీ హోల్సిమ్‌ భారత మార్కెట్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించినట్టు సమాచారం. యూరోపియన్‌ సిమెంట్‌ కంపెనీ అయిన హోల్సిమ్ .. ఇందులో భాగంగా అంబుజా సిమెంట్‌, ఏసీసీ సిమెంట్‌ కంపెనీల ఈక్విటీల్లో తనకు ఉన్న మెజారిటీను కంపెనీ అమ్మకానికి పెట్టింది. ఇందుకోసం ఇటీవలే సిమెంట్‌ రంగంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్‌తో పాటు జెఎ్‌సడబ్ల్యూ గ్రూప్‌తో ప్రాథమిక చర్చలు జరిపినట్టు సమాచారం. శ్రీసిమెంట్‌ కూడా ఈ విషయంలో ఆసక్తితో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కంపెనీలేవీ ఈ వార్తలపై అధికారికంగా నోరు మెదపడం లేదు.

                             

About Author