PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్య సేవలు

1 min read

– ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం- 104 సేవలను సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ వె ప్రసన్న వెంకటేష్ వెల్లడి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చేరువలో ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియం చేసుకోవాలని జిల్లా కలెక్టర్. వె ప్రసన్న వెంకటేష్ కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగం గుట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా, స్థానిక ఏలూరు పట్టణంలోని శనివారపుపేటలో ఉన్న వైయస్సార్ హెల్త్ క్లినిక్ వద్ద గురువారం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ని, 104 వాహనాన్ని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ మంచి ఆధునిక వైద్యం అందించాలనే సహృదయంతో తాము ఉంటున్న ఊర్లోనే వైద్య సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసిందని తెలిపారు.ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఇద్దరు డాక్టర్లు ఒక 104 వాహనంతో అనుసంధానం చేసి ప్రతిరోజు వారికి కేటాయించిన గ్రామాల్లోని డాక్టర్ వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.వారికి కేటాయించిన గ్రామాల్లో మాసంలో కనీసం రెండుసార్లు సందర్శించి ప్రజలకు వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి 44 మొబైల్ మెడికల్ యూనిట్లను (104 సేవలు) వైయస్సార్ విలేజ్ క్లినిక్ తో అనుసంధానం చేయడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్ లోని సిహెచ్ఓ, ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు సహకారంతో వైద్య సేవలు అందిస్తారన్నారు. ప్రతి డాక్టర్ వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లో 16 రకాల టెస్టులు 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్న అనేక రకాల వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యం పొందాలని కలెక్టర్ ప్రజలను కోరారు.కార్యక్రమానికి ముందు వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఉంచిన మందులు, పేషంట్ రూములు , వైద్య పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై ముద్రించిన పోస్టర్స్ లను కలెక్టర్ పరిశీలించారు.104 సేవల వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ వాహనంలో అమర్చిన వైద్యపరికాలాలను పరిశీలించి స్వయంగా డాక్టర్లచే బీపీ పరీక్షను చేయించుకున్నారు. తదుపరి 104 వాహనం ద్వారా 11 రోడ్లో ఉన్న వీఎంపీ కాంతమ్మ 83 సంవత్సరాల వృద్ధురాలు ఇంటికి వెళ్లి స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ డాక్టర్లతో కలిసి ఆమె నివాస గృహానికి వెళ్లడం జరిగింది. ఆమె అనారోగ్య పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు , దగ్గరే ఉండి డాక్టర్లతో ఆమెకు పరీక్షలు చేయించారు.ఈ కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుట్ల గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ని లాంచింగ్ గా ప్రారంభించి ప్రసంగిస్తున్న దృశ్యాలను టీవీ ద్వారా ప్రజలు వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డు కౌన్సిల్ మెంబర్ డాక్టర్ బిరిసాల ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డా. ఆశ , డి. ఐ. ఓ నాగేశ్వరరావు, డాక్టర్లు మంజుషా, జోషి రాయ్, పూర్ణచంద్ర , 104 వాహన జిల్లా కోఆర్డినేటర్ గణేష్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్. వెంకటకృష్ణ ,104 వాహన సిబ్బంది, సి హెచ్ ఓ లు, ఆశ, ఏఎన్ఎంలు, కార్పొరేటర్ శ్రీనివాస్, అద్దంకి హరిబాబు , వైసిపి నాయకులు టి ఆర్ శర్మ , ఆశ వర్కర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author