ఆధార్ కార్డ్ దుర్వినియోగం పై ప్రభుత్వం హెచ్చరిక !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆధార్ కార్డుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటనలో ప్రజలను కోరింది. కేవలం ఆధార్ కార్డుల మాస్క్డ్ కాపీస్‌ను మాత్రమే షేర్ చేయాలని తెలిపింది. ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే విధంగా జెరాక్స్ కాపీ తీసి ఇతరులకు ఇవ్వాలని తెలిపింది. ‘‘మీ ఆధార్ జెరాక్స్ కాపీని ఏ సంస్థకూ ఇవ్వకండి, ఎందుకంటే, అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఆధార్ సంఖ్యలో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించేవిధంగా మాస్క్డ్ ఆధార్‌ను మాత్రమే ఇవ్వండి’’ అని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది.