అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి
1 min read– ప్రతి యాభై ఇండ్లకు ఒక వాలంటరీ తో పాటు వైయస్సార్ పార్టీ కి చెందిన ఇద్దరు గృహ సారథులు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె నియోజకవర్గం లో సంజామల మండలం పేరుసోముల గ్రామంలో గ్రామ సచివాలయ పరిధిలో గల గ్రామ సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు గృహ సారధులు లతో కలిసి వైయస్సార్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి పార్టీని ఎలా అభివృద్ధి పథంలోకి నడిపించాలి అనే సిద్ధాంతాలను గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు కన్వీనర్లు వాలంటీర్లు గృహసారుదులతో కలిసి సమీక్షా సమావేశాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారి కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి గారు నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని ఓబుల్ రెడ్డి గారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందని ఇంకా అర్హులైన వారు ఉండి వారికి సంక్షేమ పథకాలు లభించని వారైతే అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేటట్లు చర్యలు తీసుకోవాలని కన్వీనర్లకు, గృహసారథులకు, వాలంటరీలకు ,వైయస్సార్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి వారికి సవివరంగా వివరించాలని మళ్లీ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అవుతాయని వారికి సవి వరంగా వివరించాలని గృహ సారధులకు, వాలంటీర్లకు పిలుపునిచ్చారు. మళ్లీ మనం బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న తన తండ్రి గారు కాటసాని రామిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇవ్వాలని వారికి పిలుపునిచ్చారు. 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో ప్రతి వైయస్సార్ పార్టీ అభిమాని ,కార్యకర్త, నాయకుడు, వాలంటరీ, గృహ సారధులు,అన్ని అనుబంధ సంఘాల కన్వీనర్లు,సభ్యులు అందరూ ఒక యుద్ధంలో సైనికుల వలె పోరాటం చేసి మన బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులుగా మళ్లీ కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.పేరుసోముల గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు, సంజామల మండల పరిషత్ ఉపాధ్యక్షుడు డి చిన్నబాబు, సోమ సుందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ అందనం శ్రుతి, మాసూరి శ్రీను,వడ్డే వెంకటేశ్వర్లు,బెస్త క్రిష్ణ మూర్తి,విద్యా కమిటీ చైర్మన్ ఈడిగ గౌడ్ ,మాజీ విద్యా కమిటీ చైర్మన్ నబీ రసూల్,కృష్ణ బాబు,నాగరాజు,అబ్దుల్ రఫీ,కడియం రామయ్య,ఓబులేసు, సొగల భాస్కర్, తెలుగు లక్ష్మీ నారాయణ,మద్ధిలేటి, ఘన మద్దిలేటి, సూరి, వెంకటేశ్వర్లు, మాల శేఖర్, వైయస్సార్పార్టీనాయకులు,కార్యకర్తలు,వాలంటీర్లు,గృహ సారథులు పాల్గొన్నారు .