ప్రజల ఆరోగ్యం కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే శిల్పా
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: ప్రజల ఇంటి వద్దకే డాక్టర్ వచ్చి పరీక్షించేలా , ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పథకాలు రూపొందించారని , ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం అని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. వెలుగోడు పట్టణంలో ని మూడవ సచివాలయం వద్ద మీ వద్దకే డాక్టర్ అనే పథకం లో భాగంగా గురువారం అంబులెన్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు.2 వేల జనాభాకు ఒక గ్రామీణ క్లినిక్ ఏర్పాటు చేస్తూ , ప్రతి పేదవాడికి వైద్యం అందుబాటులో కి తీసుకు రావడమే ఫ్యామిలీ డాక్టర్ పథకం ఉద్దేశం అన్నారు. ఈ క్లినిక్ లో 105 రకాల టాబ్లెట్ లు, 14 రకాల పరీక్షలు అందుబాటులో కి తెచ్చామని , ఇవి అన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకు వచ్చి , దేశంలోనే ఆదర్శంగా నిలిచాడని ఎమ్మెల్యే అన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఎన్నో వ్యాధులను చేర్చి పేదల గుండెల్లో దేవుఁడు గా నిలిచాడని తెలిపారు.వైద్యులు, సిబ్బంది ఎమ్మెల్యే ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు లక్ష్మీ ప్రసన్న , కృష్ణమూర్తి , సిహెఓ నాగేశ్వరరావు , ఆరోగ్య సిబ్బంది , ఆశా వర్కర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.