PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాల్మీకిలకు ప్రభుత్వం న్యాయం చేయాలి : మాజీ మంత్రి

1 min read

పల్లవెలుగు, వెబ్​ విజయవాడ: వాల్మీకి లకు వైకాపా ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప తెలిపారు.శుక్రవారం అలంకార్ ధర్నా చౌక్ వద్ద వాల్మీకుల సత్యాగ్రహ దీక్ష 13వ రోజుకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం కన్వీనర్ బోయ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు తమ పని తాము చేసామని మిగిలిన పార్టీలు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి తక్షణం చర్యలు చేపట్టాలని, వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలు కూడా ఈ అంశంపై పూర్తి బలపరిచే దృక్పథంతో ఉన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా వారు చొరచూపి వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీలుగా, ఏజెన్సీ మైదాన ప్రాంతంలో బీసీలుగా చూడటం దారుణం అని వివరించారు. వాల్మీకులకు జరిగిన అన్యాయం రాజకీయ పరమైనదని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. వాల్మీకులు కులవృత్తి లేని కులమని వారు ఎస్టీ జాబితాలో ఉండాల్సిన నిజమైన గిరిజనులని ఈ సమస్యపై అన్ని వ్యవస్థలో వెంటనే స్పందించాలని లేనిపక్షంలో తాము కూడా వాల్మీకుల కోసం ఉద్యమిస్తామని డిమాండ్ చేశారు. ఈ దీక్షలకు సంఘీభావముగా పదిమంది వాల్మీకి యువత బొమ్మనహాళ్ మండలం, బొమ్మనహాళ్ నుంచి పాదయాత్రగా బయలుదేరి 100 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ రాయదుర్గం నియోజకవర్గం, ఉరవకొండ నియోజకవర్గం, గుంతకల్ నియోజకవర్గం లో పూర్తిచేసి దీక్షా శిబిరానికి విచ్చేసి ఇకనుంచి వాల్మీకి యువత ఉద్యమంలో ముందుండి ఉద్యమాన్ని దావానలంలా వ్యాపింప చేస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తక్షణమే స్పందించి వాల్మీకులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ 13వ రోజు దీక్షలకు సంఘీభావముగా వాల్మీకి జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ మీనగ జగదీశ్వరరావు , వైసీపీ పార్టీ నాయకుడు రథయాత్ర రామచంద్ర , జేఏసీ ప్రధాన కార్యదర్శి ముప్పన వెంకటేశ్వర్లు, చొప్పారపు భాను ప్రకాష్, పిక్కిలి సాయి ప్రవీణ్, కేతినేని రాకేష్ వాల్మీకి, కేగర్ల నరసింహారావు, కేగర్ల నాగరాజు, సత్యసాయి ఉద్యోగ సంఘం నాయకులు జగదీష్ పూజారి దివాకర్, బడిగే వన్నూరుస్వామి, ఎర్రగొండ రాముడు బోయ లింగప్ప, బోయ అనిల్, రామాంజనేయులు, కే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author