పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకోండి
1 min read– పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్వతంత్ర అభ్యర్థి నాగరాజు
పల్లెవెలుగు , వెబ్ ఆత్మకూరు: త్వరలో జరుగబోయే పశ్చిమ రాయలసీమ శాసన మండలి ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్వతంత్ర అభ్యర్థి నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న సందర్భంగా నియోజకవర్గంలోని 2019 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీ లోపు డిగ్రీ లేదా డిగ్రీకి సమానమైన డిప్లొమా కోర్స్‌లు పూర్తి చేసుకొన్న వారు తమ ఓటును సమీప మండల తహశీల్దార్ కార్యాలయం కానీ లేదా మండల అభివృద్ది కార్యాలయంలో కానీ ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలన్నారు. నవంబర్ నెల 7వ తేదీ వరకు ఓటరు నమోదు కార్యక్రమం వుంటుందని అన్నారు. దూర ప్రాంతాల్లో వున్న గ్రాడ్యుయేట్ ఆన్‌లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోచ్చునని తెలిపారు. అలాగే పశ్చిమ రాయలసీమ శాసన మండలి కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల తరపున స్వతంత్ర అభ్యర్థిగా అనంతపురం జిల్లాకు చెందిన నాగరాజు అలియాస్ నాగేంద్ర పోటీ చేస్తున్నానని కాబట్టి మేధావి వర్గానికి చెందిన ఓటర్లు గెలిపించాలని కోరారు. వీరి వెంట సీనియర్ జర్నలిస్టు మద్దిలేటి, జయరాజ్, చంద్ర చర్ల హరి అడ్వకేట్ పాల్గొన్నారు.