ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
1 min readపలు సేవా కార్యక్రమాలకు విశేష స్పందన..
పల్లెవెలుగువెబ్,అన్నమయ్య జిల్లా రాయచోటి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పిలుపుమేరకు.. వైఎస్ఆర్ సిపి నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ అత్యవసర, ప్రమాదకర పరిస్థితులల్లో రక్తం అవసరమైన వారికి విలువైన రక్తం ఎంతో ఉపకరి స్తుందన్నారు. యువత ఉత్సాహంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.రక్త దానంలో పాల్గొన్న యువకులను, విద్యార్థులును పేరుపేరునా మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి పలకరిస్తూ అభినందనలు తెలిపారు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.203 మంది దాతలు రక్తాన్ని దానం చేశారు. పట్టణంలోని సాయి ఇంజనీరింగ్ కళాశాల, ,షిరిడీ సాయి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థి, విద్యార్థినీలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
రక్తదాతలకు కృతజ్ఞతలు: ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
జగనన్న 50 వ జన్మదిన సందర్భంగా రాయచోటి లో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న దాతలుకు పేరుపేరునా వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు , ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించడం హర్షణీయమన్నారు.శిబిరాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు,వైద్యాధికారులుకు, బ్లడ్ బ్యాంకు అధికారులు, సిబ్బందికి పేరుపేరునా శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
వీరబల్లిలో.. : వీరబల్లి మండలంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో ఎం పి పి గాలివీటి రాజేంధ్రనాధ్ రెడ్డి అధ్వర్యములోజగనన్న పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించి అగారిధెనన్నారుథకాలు ప్రవేశ పెట్టిన ఘనత పిల్లల మేనమామ జగన్మోహన్ రెడ్డి గారిధెనన్నారు .బాలికలు భరత నాట్యం చేసి సంబరాలు చేసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు .ఈకార్యక్రమములో యం ఇ వొ గిరివరధయ్య ,అటవీశాఖ అధికారులు, వై సి పి నాయకులు గాలివీటి వీరనాగి రెడ్డి ,సుబ్బారామ రాజు,నాగభూషణం, స్వామి,రాము, శ్రీరాములు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం ప్రారంభించిన మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి
జగనన్న జన్మదిన సందర్భంగా ప్రభుత్వాసుపత్రి వద్ద వైఎస్ఆర్ సిపి నాయకులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదానాన్ని మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి ప్రారంభించారు.