NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా హోటల్ నక్షత్ర ప్రారంభం…

1 min read

ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

విచ్చేసిన స్థానిక కార్పొరేటర్, వ్యాపారవేత్తలు, శ్రేయోభిలాషులు

నగర ప్రజల అభిరుచికి తగిన విధంగా రుచులు సేవలు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : స్థానిక ఎన్ ఆర్ పేట జిల్లా పరిషత్ కార్యాలయం ఎదురుగా ‘నక్షత్ర’ హోటల్ ప్రారంభమైంది. ఎంతో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హోటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అభిమానాన్ని పొందడంలో నక్షత్ర హోటల్ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  నక్షత్ర హోటల్ అధినేత ఎం రాజదుర్గ విలేకరులతో మాట్లాడుతూ నగర ప్రజల అభిరుచికి తగిన విధంగా తమ హోటల్ లో వెజ్,నాన్ వెజ్ టిఫిన్లు, స్నాక్స్లు అందుబాటులో ఉంటాయన్నారు. పాయ,పరోటా,ఆపాలు, కిచిడి,చికెన్ కర్రీ,మటన్ కీమా, ఎగ్ దోశ, కీమా దోశ, మటన్ సూప్, చికెన్ సూప్,కీమా సమోసా,చికెన్ కట్లెట్, మష్రూమ్ పకోడీ, స్ప్రింగ్ రోల్స్,తమ హోటల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్ళపల్లి  పార్థసారథి, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కో- ఆప్షన్ నెంబర్ ఎస్.యం.ఆర్ పెదబాబు, 20వ వార్డు కార్పొరేటర్ గూడూరి ప్రసాద్ పాల్గొన్నారు. వచ్చిన అతిథులను హోటల్ అధినేతలు రాజ దుర్గ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. నగరంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వినియోగదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

About Author