పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలి… స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయాలి
1 min read

సిపిఎం ర్యాలీ,ధర్నా
పత్తికొండ, న్యూస్ నేడు : పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ, సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడీశ్వర్ రెడ్డి భవనం నుండి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి డి. గోపాల్ అధ్యక్షత వహించగా సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు పెంచిందని ట్రూ ఆఫ్ పేరుతో ప్రజలపై భారాలు వేసిందని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మేము అధికారంలోకి వస్తే వైసిపి ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలను రద్దు చేస్తామని, రాబోయే కాలంలో చార్జీలు పెంచబమని ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా కూటమి ప్రభుత్వం నాయకులు వాగ్దానాలు చేసి హామీల్లో కూడా ఈ విషయం చేర్చడం అనంతరం అధికారం చేపట్టిన వెంటనే ట్రూ ఆఫ్ చార్జీలు పెంచి ఆదానీలతో ఒప్పందం చేసుకున్న స్మార్ట్ మీటర్లు కూడా బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు సామాన్య ప్రజలు అట్టడుగు వర్గాలపై బండరాయి మోపిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధాక్షణ్యంగా గత ప్రభుత్వ నిర్ణయాలను పాటించడం ఎంతవరకు సమంజసంమన్నారు. పెంచిన కరెంటు చార్జీలు వెంటనే తగ్గించాలని స్మార్ట్ మీటర్లు విధానాన్ని రద్దు పరచుకోవాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రంగారెడ్డి, దస్తగిరి, గంగన్న, తదితరులు పాల్గొన్నారు.


