PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు..

1 min read

ప్రేమతత్వమే క్రీస్తు సందేశం..

పరోపకారమే క్రీస్తు మార్గం.. క్రీస్తు మార్గం ఆచరణీయం..

జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : జీవితంలో ఏ సందర్భంలోనైనా తీసుకున్న విషయం విడవకుండా విశ్వాసంతో ముందుకు వెళితే.. వారివెంట దేవుడు అండగా ఉంటాడని, బైబిల్ కూడా అదే బోధిస్తోందని  జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు.  సెమి క్రిస్టమస్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో   ‘హై టీ ‘ కార్యక్రమం   ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముందు తొలి ప్రార్ధనా కార్యక్రమాన్ని  రెవరెండ్ వి. మిల్టన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతం మర్చిపోకుండా అహంకారం చూపించనివారిని దేవుడు  ఉన్నతస్థానంలో నిలుపుతాడన్నారు. మనం ఎలా ఉండాలనుకుంటామో పొరుగువారు కూడా అంతే సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.  2000 సంవత్సరాలకు ముందే   పరస్పర ప్రేమతత్వంతో జీవించాలని క్రీస్తు బోధించడమే కాకుండా వాస్తవంగా జీవించి చూపించారన్నారు.   ఈ సందర్బంగా సీనియర్ బిషప్ ఎబినేజెర్ శాస్త్రి  ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, అందరిపట్ల ప్రేమగా ఉండడంతో సమస్యలు కనుమరుగు అవుతాయని చెప్పారు.  చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా మాట్లాడుతూ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరిపట్ల ఒకరు ప్రేమగా ఉంటె సమాజం శాంతిమయం అవుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ అహంకారానికి లోనుకాకుండా ప్రయత్నిస్తే అందరిలోనూ దైవాన్ని చూడవచ్చన్నారు.  ఈ సందర్భంగా విద్యార్ధినిలతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే ఎలీజా  కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రొవ్వోత్తుల వెలుగులతో ప్రత్యేక ప్రార్ధనా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు.  ఈ సందర్భంగా గుడ్ సమరిటన్ కాన్సర్ ఆసుపత్రికి చెందిన ఫాదర్ రవిబాబు ను  ఘనంగా సత్కరించారు.  రెవరెండ్ ఫా: ఐ మైకేల్  ముగింపు ప్రార్ధన నిర్వహించారు. ఈ సందర్బంగా  పలువురు  క్రిస్మస్ కు సంబంధించి పలు గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని   జిల్లా  మైనారిటీ సంక్షేమశాఖ అధికారి ఎన్.ఎస్.కృపవరం నిర్వహించారు. కార్యక్రమంలో  డిఆర్ డి ఎ పిడి డా:ఆర్. విజయరాజు, డీ ఈ ఓ శ్యాం సుందర్, తదితరులు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో  నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ టి. శ్రీపూజ, గృహనిర్మాణశాఖ పిడి కె. రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాధ్ శ్రీనివాస్, సోషల్ వెల్ఫేర్ జెడి జయప్రకాష్, డిఎంహెచ్ఓ డా. ఎస్. శర్మిష్ట, డిటిసి శాంతకుమారి, ఆర్ అండ్ బి. ఎస్ఇ జాన్ మోషే, ఎల్ డిఎం నీలాధ్రి, డిసిహెచ్ ఎస్ పాల్ సతీష్, పశుసంవర్ధక శాఖ జెడి జి. నెహ్రూబాబు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏ డి రాకాడ మని, బూరగడ్డ కాంతి రవికిరణ్, పొలిమేర హరికృష్ణ, మేతర అజయ్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

About Author