శ్రీకాళహస్తిలో దాత కు ఘన సన్మానం
1 min read
పల్లెవెలుగు, వెబ్ మహానంది : శ్రీకాళహస్తి క్షేత్రంలో దాతకు ఘన సన్మానం జరిగింది ..శనివారం నంద్యాలకు చెందిన కూరగాయల వ్యాపారి లక్క బోయిన ప్రసాద్ శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవాలను దర్శించుకున్నారు .ప్రతి సంవత్సరం శ్రీకాళహస్తి దేవస్థానానికి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగాకావాల్సిన కూరగాయలను ఆయన అందజేస్తున్నారు .దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయ చైర్మన్ ఏ శ్రీనివాసన్ తో పాటు పి ఆర్ ఓ గంజి మల్లికార్జున ప్రసాద్ ఆయనను దుశ్యాలువ తో సత్కరించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదలను అందజేశారు .దాతలను గౌరవిస్తే ఆలయం అభివృద్ధి చెందుతుంది అనే భావనలో ఆలయ అధికారులు సన్మానించినట్లు తెలుస్తుంది .శ్రీకాళహస్తి తో పాటు పలు దేవాలయాలకు మహాశివరాత్రి సందర్భంగా కూరగాయలను వితరణ చేస్తున్నట్లు తెలిపారు .మహానంది దేవస్థానంలో అమలవుతున్న నిత్య అన్న ప్రసాద వితరణ కు కూరగాయలను ఏడాది పొడవునా చేస్తున్నారు .