PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుట్టాకు.. గ్రీన్​ సిగ్నల్​..?

1 min read

వైసీపీ కర్నూలు ఎంపీ లేదా.. ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్..?

  • గుమ్మనూరు జయరాం … రాం..రాం.. చెప్పడంతో… బుట్టా రేణుకకు ఛాన్స్​
  • ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనూ సానుకూల పరిస్థితి
  • సర్వేలన్నీ ఆమె వైపే…
  • దీర్ఘాలోచనలో … వైసీపీ అధిష్ఠానం…!
  • ఐదేళ్ల నిరీక్షణకు…ఫలితం.. దక్కేనా…?
  • ఉత్కంఠకు తెరలేపిన ఐదో జాబితా..

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు రాజకీయం…రసవత్తరంగా సాగుతోంది… వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు ప్రకటించిన నాలుగు జాబితాలో ఆశావహుల పేర్లు లేకపోవడంతో… నిరాశకు నిస్పృలకు లోనయ్యారు. 80శాతం కొత్త వారికి అవకాశం కల్పిస్తామన్న సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఆదిశగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు సిట్టింగ్​ ఎమ్మెల్యేలు.. ఎంపీలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇక ఐదో జాబితా ఉత్కంఠకు తెరలేపింది. కోడుమూరుకు ఆదిమూలపు సురేష్​, ఆలూరు– విరుపాక్షికి టిక్కెట్ కన్ఫామ్​ చేస్తూ.. పార్టీ అధిష్ఠానం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంకా పత్తికొండ, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు టిక్కెట్లపై చర్చ సాగుతూనే ఉంది. దీనికంతటికి.. ఐదో జాబితాలో తెర ముగియనుంది.

బీసీలకు.. ప్రాధాన్యత..

కర్నూలు పార్లమెంట్ టిక్కెట్​ను ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వాల్మీకికి ఇస్తూ… వైసీపీ అధిష్ఠానం ఇటీవలె ప్రకటించింది. ఆలూరు అసెంబ్లీ టిక్కెట్ విరుపాక్షికి ఇచ్చారు. కాగా కర్నూలు ఎంపీ టిక్కెట్​ తనకు వద్దని ఇటీవల గుమ్మనూరు జయరాం పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇస్తూ… అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుకకు అవకాశం కల్పించే దిశగా అధిష్ఠానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

బుట్టా అంటేనే… బ్రాండ్..!

2014 సార్వత్రిక ఎన్నికల్లో  ఎంపీ బరిలో నిలిచిన బుట్టారేణుక ప్రత్యర్థి అభ్యర్థిపై దాదాపు 45వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఐదేళ్లు ఆమె కర్నూలు పార్లమెంట్​ పరిధిలోని అన్ని నియోజవర్గాల్లోనూ అభివృద్ధి పనులు చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో… ప్రజా సేవ చేయడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు.  ఇప్పటికీ ఆమెకు ప్రజాదరణ మెండుగా ఉందనే చెప్పవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఆమెకు ఉన్నంత పేరు… మరెవరికీ లేదని సర్వేల ద్వారా వైసీపీ అధిష్ఠానానికి తెలియడంతో… ఎమ్మిగనూరు టిక్కెట్​పై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

సర్వేలన్నీ…ఆమె వైపే…

కర్నూలు రాజకీయం బుట్టారేణుక వైపు తిరుగుతోందని చెప్పవచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చేనేతలు అధికంగా ఉన్న (చేనేతపురి) ఎమ్మిగనూరులో అప్పటి అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే  చెన్నకేశవ రెడ్డి  చేనేత బిడ్డ,  వైసీపీ మహిళా నాయకురాలుగా ఉన్న బుట్టారేణుకను ప్రచారానికి కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. అప్పట్లో పద్మశాలీలు బాధ పడినా…. వైసీపీ అధినేత, సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డిని చూసి ఓట్లు వేసి… చెన్నకేశవ రెడ్డిని  అధిక మెజార్టీతో గెలిపించారు. ప్రస్తుతం ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్​ ఆశిస్తోందని భావించిన చెన్నకేశవ రెడ్డి తన అనుచరుడు..నమ్మకస్తుడైన చేనేత బిడ్డ మాచాని వెంకటేశ్వర్లుకు టిక్కెట్​ ఇవ్వాలని పట్టుబట్టడంతో ఎమ్మిగనూరు అసెంబ్లీ కన్వీనర్​గా అధిష్ఠానం ప్రకటించింది.  కాగా సర్వేలన్నీ మాజీ ఎంపీ బుట్టారేణుక వైపు చూపుతుండటంతో …దిక్కుతోచని ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మళ్లీ తన కొడుకు జగన్​మోహన్​ రెడ్డికి టిక్కెట్​ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

ఐదేళ్ల నిరీక్షణకు…ఫలితం దక్కేనా..?

2019లో మిత్రులు..అనుచరుల సూచనతో చేసిన తప్పిదాలను సరిదిద్దుకునేందుకు.. ఒక్క అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ బుట్టారేణుక ఐదేళ్లుగా వైసీపీలోనే నిరీక్షిస్తున్న విషయం జిల్లా ప్రజలకు.. అధిష్ఠానానికి తెలిసింది. 2019లో వైసీపీ భారీ మెజార్టీతో 151 సీట్లతో అధికారంలోకి వచ్చినా.. ఐదేళ్లలో ఎటువంటి నామినేటెడ్​ పదవి కూడా ఆశించకుండా…  ఆమె పార్టీకి సేవ చేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ.. అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలో తన వంతు కృషి చేస్తోంది. ఎప్పటికైనా సీఎం వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డి తనకు అవకాశం కల్పిస్తారని నమ్మకంతో ఉన్న బుట్టారేణుకకు… అసెంబ్లీ లేదా పార్లమెంట్​ సీటు దక్కేలా ఉందని కర్నూలు జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.

About Author