NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టణంలో 300 లక్షల పనులకు భూమి పూజ

1 min read

డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం

పగిడ్యాల’లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కేజీ రోడ్డు డివైడర్ సెంట్రల్ మీడియన్ మరియు సెంట్రల్ లైటింగ్ పనులకు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యకవర్గ సభ్యులు మాండ్ర శివానందరెడ్డి పనులకు భూమి పూజ చేశారు. శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన భూమిపూజ శిలాఫలకం పనుల ప్రారంభోత్సవానికి వారు హాజరయ్యారు.ఆర్టీసీ బస్టాండ్ నుండి ఆత్మకూరు రోడ్ శ్లోకా స్కూల్ హెచ్డిఎఫ్ సీ బ్యాంక్ వరకు బిపిఎస్ మరియు ఎల్ఆర్ఎస్ 300 లక్షల నిధులతో ఈ పనులు జరగనున్నాయి.ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నందికొట్కూరు పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణంలో రోడ్డు మధ్యలో డివైడర్లతో సెంట్రల్ లైటింగ్ పనుల అనంతరం పట్టణం వెలుగులతో విరజిల్లుతుందని అన్నారు. ఈ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేయడం జరిగిందని అన్నారు.ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు.

పగిడ్యాల’లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

పగిడ్యాల మండల పరిధిలోని ప్రాతకోట గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే మరియు శివానందరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి,డిఈఈ నాసి ర్,అసిస్టెంట్ ఇంజనీర్ బి దినేష్ కుమార్,మాజీ కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్, భాస్కర్ రెడ్డి,సొసైటీ చైర్మన్ ముర్తు జావలి,లాయర్ జాకీర్,జమీల్,డాక్టర్ వనజ తదితరులు పాల్గొన్నారు.

About Author