హ్యాకథాన్ బ్రాండ్ అనుమతులు అధికారికంగా రాపర్తి హరి సాయి చేతికి
1 min read

హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల అధికారికంగా 2026 సంవత్సరానికి తెలంగాణలో బ్రాండ్ వినియోగ హక్కులు అప్పగింపు
హైదరాబాద్, న్యూస్ నేడు: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ బ్రాండ్ హ్యాకథాన్ 2026 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అనుమతులను అధికారికంగా అప్పగించింది. బ్రాండ్ అనుమతుల అప్పగింపు అనేది బాధ్యతాయుతమైన అమలు, నాణ్యత ప్రమాణాలు మరియు స్పష్టమైన దృష్టితో జరగాలని, తెలంగాణకు ఇచ్చిన ఈ అనుమతులు ఆ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు.ఈ బ్రాండ్ అనుమతులు అందుకున్న సందర్భంగా రాపర్తి హరి సాయి గౌడ్ స్పందిస్తూ, హ్యాకథాన్ వంటి ప్రతిష్ఠాత్మక బ్రాండ్‌ను 2026లో తెలంగాణలో నిర్వహించే బాధ్యత తనకు లభించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. యువతలో ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడం, విద్యార్థులు మరియు స్టార్టప్‌లకు సరైన వేదికలు కల్పించడం, హ్యాకథాన్ బ్రాండ్ విలువలకు అనుగుణంగా కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

