పిల్లలు ఏమైనా యంత్రాలా? ఉపాధ్యాయులు ఏమైనా రోబోలా?
1 min read

ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి
ఎం. సి. సుంకన్న
పత్తికొండ, న్యూస్ నేడు: పిల్లలు ఏమైనా యంత్రా లా? ఉపాధ్యాయులు ఏమైనా రోబోలా? అని ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుంకన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పత్తికొండ స్థానిక ఎస్టియు ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం పత్తికొండ మండల ఎస్టీయూ అధ్యక్షుడు ఆవుల నాగరాజు అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .సి .సుంకన్న (వాసు )రాష్ట్ర కార్యదర్శి ఇట్రెడ్డి రామ్మోహన్ రెడ్డి మరియు జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో యం. సి.సుంకన్న మాట్లాడుతూ, పిల్లలు ఏమైనా యంత్రాల? ఉపాధ్యాయులు రోబోలా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతోమంది మానసిక నిపుణులు, మేధావులు పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేయరాదని, వారికి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను బోధించాలని మరియు చదివించాలని చెప్పినప్పటికీ ,ఎన్నో అధ్యయనాలు వివరించినప్పటికీ, ఎంతోమంది విశ్లేషకులు తెలియజేసినప్పటికీ, ప్రభుత్వము “100 డేస్ యాక్షన్ ప్లాన్ మరియు “జి. ఎఫ్ ఎల్ ఎన్ యాక్షన్ ప్లాన్”పేర్లతో పిల్లలకు, ఉపాధ్యాయులకు విరామము ఇవ్వకుండా యంత్రాల్లాగా ,రోబోల లాగా పని చేయమంటున్నారని ,పిల్లలను చదవమని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు యాజమాన్యములలో ఇలాంటి మానసిక ఒత్తిడికి గురై చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయము ప్రభుత్వానికి తెలియదా ?అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వము పదవ తరగతి విద్యార్థులకు “100 డేస్ యాక్షన్ ప్లాన్”మరియు “జి ఎఫ్ ఎల్ ఎన్ యాక్షన్ ప్లాన్” పేర్లతో ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలను కూడా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

