PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేనేత హస్తకళ ప్రదర్శన… అమ్మకం..

1 min read

శ్రీరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో నవంబర్ 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు..

చేనేత హస్తకళలను ప్రోత్సహించి, ప్రతి ఒక్కరూ సహకరించాలి..మేయర్ షేక్ నూర్జహాన్​ పెదబాబు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : రాష్ట్రంలో ప్రాచీన చేనేత హస్తకళలను, కళా వస్తువులను మనమంతా ప్రోత్సహించి అదరించలన్ని ఏలూరు నగర మేయర్ షెక్ నూర్జహన్ పెదబాబు అన్నారు. మేయర్ నూర్జహాన్ దంపతులు మరియు 21వ డివిజన్ కార్పొరేటర్ అన్నపనేని భారతి రవి  కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రదర్శనలో పోచంపల్లి, టై అండ్ డై, నారాయణపేట, గద్వాల్ ,వెంకటగిరి, జరీ చీరలు, మంగళగిరి, గుంటూరు చీరలు, సిల్క్ కాటన్ చీరలు, చందేరి పాటూరి చీరలు, కాటన్ ప్రింటెడ్ చీరలు, చేనేత దుప్పట్లు, మంగళగిరి, చీరాల ,బంజారా, గాగ్రా డ్రెస్సులు, టీవీ కవర్స్, సోఫా కవర్స్, టవల్స్ , నరసాపురం లేసులు, ఖది మెటీరియల్స్, ఒక గ్రాము గోల్డ్ నగలు మొదలైన ఈ ప్రదర్శన మరియు అమ్మకాల్లో లభిస్తాయి అన్నారు. అలాగే హస్తకళ వస్తువులు కొండపల్లి బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు పొయ్యతో చేసిన బొమ్మలు రోజు వుడ్ సాగర్ సాగరం గపూర్ వస్తువులు బ్లాక్ మెటల్ వస్తువులు వెండి ముత్యాల ఆభరణాలు ఇత్తడి వస్తువులు నారపీచు వస్తువులు సెరామిక్ వస్తువులు స్పటిక రుద్రాక్ష మాలలు అందమైన టెర్రకోట పూల కుండీలు నిద్ర వస్తువులు అగర్బత్తీలు ఇంకా అనేక రకాల తినుబండారాలు, మహిళల కావలసిన వంటకాల మసాలాలు, ఈ ప్రదర్శనలో లభిస్తాయి అన్నారు. అలాగే పాత పట్టు చీరలు ఖరీదుకుతీసుకోబడతాయని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు స్వదేశీ హ్యాండీక్రాఫ్ట్ సొసైటీ నిర్వాహకులు కె చిరంజీవి ,వై రాంబాబు పాల్గొని పర్యవేక్షిస్తున్నారు.

About Author