PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేనేత హస్తకళలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది

1 min read

– దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: రాష్ట్రంలో చేనేత హస్త కళాకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి అన్నారు. చేనేత హస్తకళాకారుల జీవన విధానాన్ని వారి స్థితిగతులపై శ్రీకాకుళం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేనేత హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ బడిగించల విజయలక్ష్మి ప్రారంభించిన యాత్ర గురువారం ఏలూరు చేరుకుంది. ఈ సందర్భంగా ఏలూరులోని దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చేనేత హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ ముదుగురు సూర్యారావు మాస్టారు ఆధ్వర్యంలో దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత, హస్తకళాకారులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. చేనేత హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ బడిగించల విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి ప్రారంభించిన ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని తెలిపారు. యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో హస్త కళాకారుల స్థితిగతులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఏలూరు తివాచీల పరిశ్రమకు, అగరబత్తీల తయారీకి ప్రసిద్ధిగాంచిందని, దీంతోపాటుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రాగి, ఇత్తడి వాటితో వస్తువుల తయారీ కళాకారులు ఉన్నారని చెప్పారు. వారందరి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. చేనేత, హస్తకళల కార్పొరేషన్ డైరెక్టర్ ముదుగురు సూర్యారావు మాస్టారు మాట్లాడుతూ దేశంలో చేనేత హస్త కలలకు సంబంధించి 17 షో రూమ్ లు ఉండగా వాటిలో 14 షో రూములు రాష్ట్రంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. చేనేత హస్త కళాకారుల అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో శిల్పారామం సబ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. హస్తకళాకారులను నేరుగా కలుసుకుని వారి అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొటారు రామచంద్రరావు,హస్తకళల కార్పొరేషన్ సభ్యులు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

About Author