NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం లకు  బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

1 min read

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్

కర్నూలు, న్యూస్ నేడు :  బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులకు,వారి కుటుంబ సభ్యులకు  రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి వర్యులు టీజీ భరత్  బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ముస్లింల ఆరాధ్య గ్రంథం దివ్య ఖురాన్ ప్రకారం సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి మానవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్‌ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్‌ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ బక్రీద్‌ అని, ఎంతో పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పండుగ దాన గుణానికి, త్యాగానికి ప్రతీక అని వారు తెలిపారు. తమకు ఉన్న దాంట్లో నుంచే ఇతరులకు కొంత పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదు అనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందన్నారు..ముస్లింలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్ర కూడా ప్రారంభం అయ్యే ఈ శుభ దినాలలో ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. ముస్లిం సోదరులు అందరూ వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా  బక్రీద్ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.

About Author