NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా జైలు తనిఖీ…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : శుక్రవారం శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి ,కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాది కార సంస్థ, కర్నూల్    కేంద్ర కారాగారం , మహిళ కారాగారాంను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  జడ్జి  జైలు ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ను తనిఖీ చేసి “జైలు ఖైదీలకు ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్” గురించి వివరించారు. ఇందులో ఒక అడ్వకేట్, ఒక ప్యారా లీగల్ వాలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జైలు లలో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తనతో శిక్షను పూర్తి చేయాలని కోరారు.ఖైధి లకు ఎవరికైనా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు.  70 ఏళ్ళు వయస్సు పై బడిన ఖైధిలకు, అనారోగ్యంతో బాధ పడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తా మని త్యరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని తెలిపారు.   ఖైధి లకు అందించే ఆహారాన్ని,రేషన్ ను వారి ఆరోగ్యం గురించి తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఖైధి లను కోర్ట్ వాయిదా లకు కచ్చితంగా హాజరు చెయ్యాలని ఆదేశించారు.ఏవైనా సమస్యలుంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూలు వారిని సంప్రదించవచ్చును అన్నారు,  లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 పై ప్రచారం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జైలు అధికారులు, లాయర్ శివరాం  మరియు ఖైదీలు పాల్గొన్నారు.

About Author