PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి జన్మదిన వేడుకలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయులు యువ నాయకులు సీకే దీన్నే జడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం యువ నాయకులు  గుమళ్ళ సాయికుమార్ రెడ్డి  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఉదయం 10 గంటలకు పాత టోల్గేట్ వద్ద నుండి చెన్నూరు వరకు మండల వ్యాప్తంగా ఉన్న వైయస్సార్సీపి యువ నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు,తదుపరి వైఎస్ఆర్సిపి  సీనియర్ నాయకులతో కలసి వైయస్సార్సీపి కార్యాలయం నందు గల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు, అలాగే మరి కొంతమంది యువకులు రక్తదాన కార్యక్రమం  నిర్వహించడం జరిగింది, అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణం నందు వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు, ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీయన్ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయులు పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి, నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు, ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఉంటే తన వంతు మానవతా దృక్పథంతో ఆయన అక్కడికక్కడే సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు, కాబట్టి ఆయన జన్మదినాన్ని వైఎస్ఆర్సిపి యువ నాయకులు గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి, ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం పట్ల వారు గుమ్మల సాయి కుమార్ రెడ్డిని అభినందించారు, గతంలో నాయకుల పుట్టినరోజు అనేక పర్యాయాలు నిర్వహించినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా నిర్వహించలేదని భారీ ఎత్తున మండల స్థాయిలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం గర్వకారణం అని తెలిపారు… ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, గుమ్మల మధుసూదన్ రెడ్డి, గుమ్మల్ల శివారెడ్డి, పెడ బ ల్లె ప్రదీప్ రెడ్డి , టి ఎన్ మహేశ్వర్ రెడ్డి, పూజయ్య, మండల కో ఆప్షన్ నెంబర్ వారీష్, సర్పంచ్లు సిద్దిగారి వెంకటసుబ్బయ్య, సొంతం నారాయణరెడ్డి, ఎంపిటిసిలు ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, దుంప నాగిరెడ్డి, మైనార్టీ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author