PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజలందరికీ సుఖ సంతోషాలను, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను అందించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. దీపావళి చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుందని తెలుపుతూ, చీకటిని పారద్రోలి వెలుగుని నింపే ఈ పండుగ మనలోని అజ్ఞానాన్ని రూపుమాపి జ్ఞాన కాంతులను అందించాలని కోరారు. అలాగే ప్రజలంతా సమాజ హితాన్ని కోరుతూ చెడుని ఎదిరిస్తూ మంచికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథాన పురోగమిస్తున్న వేళ, ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని అభిలాషించారు. అదే విధంగా దీపావళి పండుగను సాంప్రదాయబద్ధంగా దేదీప్యమానమైన దీపపు కాంతులతో జరుపుకోవాలని పేర్కొన్నారు.

About Author