ఘనంగా జాతీయ సైన్స్ విజ్ఞాన దినోత్సవం
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శశికళ ఆధ్వర్యంలో “జాతీయ సైన్స్ విజ్ఞాన దినోత్సవం” వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట శ్రీ సివి రామన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సైన్స్ డే కార్యక్రమంలో లో అనేకమంది బాలికలు స్వయంగా తయారు చేసిన సైన్స్ మోడల్స్ ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని సైన్సు ఉపాధ్యాయులు అయిన పద్మజ ,ఆరాధన ,రాజశేఖర్, భారతి ,శారద మరియు బాలరాజు నిర్వహించారు. ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ విజ్ఞాన దినోత్సవాన్ని ఫిబ్రవరి 28వ తేదీన జరుపుకుంటారు. ఈరోజు సర్ సివి రామన్ ” రామన్ ఎఫెక్ట్ ” కనిపెట్టారు. కాబట్టి ఈ రోజునే సైన్స్ డే గా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.
