PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీధి కుక్క‌ల కోసం ల‌క్ష‌ల జీతం వ‌దులుకున్నాడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మ‌నుషుల‌కు కుక్క ఎంతో ఇష్ట‌మైన జంతువు. ప్ర‌స్తుతం కుక్కులు లేని ఇల్లు ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంత‌లా కుక్కులకు మనుషులతో స్నేహా సంబంధం ఏర్పడింది. అయితే ఇళ్లలో ఉండేవి పెంపుడు కుక్కలు కాబట్టి వాటి ఆలనా,పాలనా మనమే చూస్తాం. మరి వీధుల్లో తిరిగే కుక్కల పరిస్థితి ఏంటీ..? స‌రిగ్గ ఇదే పాయింట్ సాహిత్య వ‌ర్ధ‌న్ కు క‌దిలించింది. నోరు లేని జంతువుల ఆలనా, పాలనా ఎవరు చూస్తారనే సున్నితమైన అంశం సాహిత్య వర్ధన్‌లో కలగడంతో లక్ష‌ల రూపాయిల జీతం ఇస్తున్న సాఫ్ట్‌ వేర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వీధి కుక్కులపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన క‌ల్పించడానికి దేశం మొత్తం సైకిల్‌పై తిర‌గాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అందులో భాగంగానే ప్ర‌స్తుతం వీధి కుక్కుల కోసం భార‌తదేశ యాత్ర చేస్తున్న సాహిత్య వ‌ర్ధ‌న్‌ను న్యూస్‌18 ప‌ల‌క‌రించింది. కుక్కలతో తనకున్న అనుబంధానికి ప్ర‌జ‌ల‌కు చెబుతూనే మ‌రో వైపు కుక్కుల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహాన కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తున్నారు వ‌ర్ధన్. ప్ర‌స్తుతం వీధి కుక్కల గురించి అవగాహన కల్పించేందుకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్ యాత్ర‌లో ఉన్నారు ఈ జంతుప్రేమికుడు. ఈ యాత్రంలో వ‌ర్ధ‌న్ ఒక్క‌డే కాదు తనతో పాటు ఐదు నెలల కుక్కపిల్లను కూడా వెంటపెట్టుకొని తిరుగుతున్నారు.

                                        

About Author