తల్లి, చెల్లి, తమ్ముడిని హతమార్చాడు..!
1 min readపల్లెవెలుగు వెబ్, ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. సొంత కొడుకే తల్లిని, చెల్లిని, తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ప్రొద్దుటూరులోని హైదర్ ఖాన్ వీధిలో చోటుచేసుకుంది. తన వివాహ వివాదం విషయంలో తల్లి, చెల్లి, తమ్ముడు .. తనకు సహకరించడంలేదని కరీముల్లా ఈ దారుణానికి ఒడిగట్టాడు. తెల్లవారుఝామున నిద్రిస్తున్న తల్లి గుల్జార్ బేగం, తమ్ముడు మహమ్మద్ రఫీ, చెల్లి కరీమున్నీసాను రోకలిబండతో బాది హత్య చేశాడు. ఈ ఘటనతో ప్రొద్దుటూరు ఉలిక్కిపడింది. హత్య చేసిన అనంతరం కరీముల్లా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.