యోగా సాధన ద్వారా ఆరోగ్యం
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్రబాబు
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం యోగా సాధన ద్వారా ఆరోగ్యం లభిస్తుందని కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా కర్నూలు అవుట్ డోర్ స్టేడియం నుండి కొండారెడ్డి బురుజు వరకు నిర్వహించిన మాస్ ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ యోగా ను అందరికీ అందించాలి అనే బృహత్తరమైనటువంటి ఆశయముతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారి సమక్షంలో విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఐదు లక్షల మందితో ఒకే సమయంలో ఒకే వేదికపై సాధన చేస్తూ ఒక ఈవెంట్ ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంలో దానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిని గ్రామాలు, పట్టణాలు, నగరాలు, కార్పొరేషన్లు అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ను భాగస్వామ్యం చేస్తూ ఉన్నది. యోగ కార్యక్రమంలో భాగంగా ఒక నెల రోజులపాటు యోగ పై అవగాహన, అభ్యాస కార్యక్రమాలు చేయడానికి ప్రణాళిక ను కూడా ప్రకటించిందని, మే 21వ తేదీ కర్టన్ రైజర్ తో ఈవెంట్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలతో పాటు కర్నూలు నగరంలో కూడా మే 21 తారీఖున ప్రజలందరిని భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాలను ప్రారంభించుకున్నామన్నారు. ఈ నెల రోజులలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా యోగ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈరోజు చిన్నారులను, పెద్దలను, వయోవృద్ధులను, ఉద్యోగులు, వ్యాపారస్తులు, తదితర అన్ని వర్గాల వారిని అందరిని భాగస్వాములు చేస్తూ ఒక మెగా ర్యాలీని కూడా నిర్వహించుకుంటున్నామన్నారు. జిల్లాలో యోగా గురువుల చేత మాస్టర్ ట్రైనర్స్ కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందని, అన్ని మండలాలకి, మున్సిపల్ కార్పొరేషన్ లకి, మాస్టర్ ట్రైనర్స్ ను పంపించడం జరుగుతుంది, ఈరోజు నుండి ఐదు రోజులపాటు ఈ మాస్టర్ ట్రైనర్స్, ప్రణాళిక బద్ధంగా ఐదు రోజులపాటు ట్రైనర్స్ కు శిక్షణ కూడా ఇస్తున్నారని అన్నారు, ఈ ట్రైనర్స్ కు తర్ఫీదు ఇచ్చి వారి ద్వారా జూన్ రెండో తారీకు నుండి మరో ఐదు రోజులపాటు వారి వారి ప్రాంతాల్లో గ్రామా పంచాయితీ లలో, వార్డులలోని, ప్రజలకు శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసిందని అన్నారు. ప్రభుత్వం తలపెట్టినటువంటి మంచి కార్యక్రమం లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. యోగా అన్నది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం అన్నారు. ఇది భారతీయులు కనుగొన్నటువంటి ఒక గొప్ప నైపుణ్యమైనటువంటి విద్య దీన్ని ప్రపంచ ప్రజలందరికీ పరిచయం చేస్తూ 10 సంవత్సరాల ముందుగానే అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రజలందరికీ తెలియజేసేలా చేయడం జరిగింది. దానిలో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన ప్రకటించడం జరిగిందన్నారు,2025 వ సంవత్సరం జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యోగా ను ప్రతి ఒక్కరు నేర్చుకొని అభ్యాసం చేసుకుంటే వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోడీఎస్ఓ రాజా రఘువీర్, సెట్కూర్ సీఈవో డాక్టర్ వేణుగోపాల్, డిఎస్డిఓ భూపతి రావు, డి ఆర్డిఎ…పీడీ రమణారెడ్డి, రాష్ట్ర యోగా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి, ఫిషరీస్ ఏడి రంగనాథ్ బాబు,ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.