ఉచిత వినికిడి శిబిరం విజయవంతం
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/10072.jpg?fit=550%2C413&ssl=1)
250 మందికి వైద్య పరీక్షలు
- ఆండియాలజిస్ట్ డా. శివకృష్ణ
కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్ సమీపం..వుడ్ ల్యాండ్ దగ్గరున్న కృష్ణ క్లినిక్ 19వ వార్షికోత్సవం సందర్భంగా సిగ్నియా కంపెనీ నేతృత్వంలో ఉచిత వినికిడి వైద్య శిబిరం నిర్వహించినట్లు క్లినిక్ యజమాని, ఆండియాలజిస్ట్ డా. శివకృష్ణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ క్లినిక్ వార్షికోత్సవం పురస్కరించుకుని నాలుగు రోజులపాటు వినికిడి పరీక్షలు చేసి.. అవసరమైన వారికి యంత్రాలను 30 శాతం డిస్కౌంట్తో అందజేశామన్నారు. దాదాపు 350 మంది వినికిడి వైద్య పరీక్షలు చేశామని, ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు.