PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హార్ట్ ఫౌండేషన్ సేవలు విస్తృతం చేయాలి – మాజీ ఎంపీ టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సేవలు విస్తృతం చేయాలని మాజీ యంపీ టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక ఎ.క్యాంప్ లోని హెల్త్ క్లబ్ లో నూతనంగా ఏర్పాటు చేయనున్న లిఫ్ట్ కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరవయ్యేళ్ల కిందట ప్రారంభించిన కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించారని ఆయన అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఆయన చెప్పారు.  హెల్త్ క్లబ్ లో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని టీజీ వెంకటేష్  సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కార్యదర్శి డా. చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు డా. భవానీ ప్రసాద్, డా. వసంతకుమార్, సభ్యులు కేసీ రాముడు, నాగేశ్వర బాబు, లక్ష్మన్న, వాసు, ప్రహ్లాదరావు, జగన్నాథ గుప్త, పోతన్న తదితరులు పాల్గొన్నారు.

About Author