NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోళగుందలో భారీ వర్షం

1 min read

40.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు తో రైతన్నలు హర్షం

హోలగుందన్యూస్ నేడు: హోళగుంద మండలంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో కుండపోత వర్షం పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల సమాచారం ప్రకారం హోళగుందలో ఒక్క గురువారం రాత్రిలోనే 40.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.భారీ వర్షం రైతన్నలు ఆనందం వ్యక్తం చేశారు కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు.చెరువులు, కాలువలు వర్షపు నీరు నిలవడంతో మూగజీవాలకు ఎంతో మేలు జరిగిందని నా రైతులు హర్షం వ్యక్తం చేశారు వర్షం ప్రభావంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ ప్రజలు అవసరం లేకుండా బయటకు రావద్దని సూచించారు. మండల యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *