కేజీఎన్ టైల్స్ లో తప్పిన ప్రమాదం
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కర్నూలు రోడ్డు మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న కేజీఎన్ టైల్స్ మరియు గ్రానైట్స్ గోడౌన్ లో కరెంట్ సర్క్యూట్ వల్ల భారీ ప్రమాదం తప్పింది.శుక్రవారం మధ్యాహ్నం 1:30 సమయంలో ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.కేజీఎన్ టైల్స్ అధినేత అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ గోడౌన్ పక్కన ఉన్న డిష్ సంబంధించిన వ్యక్తి 11 కెవీ విద్యుత్ తీగలు వేయటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.గోడౌన్ లో ఉన్న వస్తువులు కాలి బూడిద అయ్యాయి.వెంటనే అప్రమత్తమై కరెంట్ కనెక్షన్ తొలగించి నీళ్లతో మంటలను అదుపు చేశారు.తర్వాత ఫైర్ ఇంజన్ వచ్చి నీటితో మంటలను సద్దుమణిగేలా చేశారు.50వేల నష్టం వాటిల్లినట్లు టైల్స్ యజమాని గఫార్ తెలిపారు.


