27 నుంచి 30 వరకు భారీ వర్షాలు …
1 min read
కౌతాళం, న్యూస్ నేడు: మండల కేంద్రమైన జిల్లా కలెక్టర్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ సూచనలు మేరకు 27 నుంచి 30 వరకు భారీ వర్షాలు కౌతాళం తాసిల్దార్ రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మూడు రోజులు భారీ వర్షాలు గాలివాన ఉరుముల తో కూడిన వర్షం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కౌతాళం మండలంలోని ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని అవసరమైతేనే బయటికి రావాలి అని సూచించారు. నది ఒడ్డున ఉండే గ్రామాలు, మెలిగనూర్ నాదిచాగి, గుడికాంబాలి వల్లూరు, మరాలి, గ్రామ ప్రజలందరూ నది దగ్గరకు వెళ్లకూడదని సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని బయట బహిరంగ ప్రదేశాలలో చెట్ల కింద విద్యుత్ స్తంభాలు కింద ఉండకూడదని తెలియజేశారు. వర్షం పడుతున్న సమయంలో స్తంభాలను విద్యుత్ బోర్డర్లను ముట్టుకోకూడదని పిల్లలను వృద్ధులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మండల ప్రజల ప్రజలందరికీ తెలియజేశారు.