PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ వారం ఓటీటీలో విడుద‌ల అయ్యే చిత్రాలు ఇవే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఓటీటీల రాక‌తో డిజిట‌ల్ ఫ్లాట్ ఫార‌మ్ కు డిమాండ్ పెరిగింది. క‌రోన పుణ్యమా అని.. థియేట‌ర్లలో రిలీజ్ కావ‌ల్సిన చిత్రాలు.. ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయి. దీంతో సినిమా అభిమానులు రిలీజ్ మూవీల‌ను ఓటీటీలో చూడాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా లాంటి ఓటీటీల్లో ప్రస్తుతం చాలా సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. క‌రోన ఎప్పుడు త‌గ్గుతుందో.. ఎప్పుడు థియేట‌ర్లలో సినిమాలు రిలీజ్ అవుతాయో తెలియని సంధిగ్దంలో ప్రేక్షకులు ఉన్నారు. త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో ఓటీటీల పై సినిమాలు చూస్తున్నారు. ఈ వారం కొన్ని కొత్త చిత్రాలు ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయి. అవేంటో తెలుసుకుందామా మ‌రి.

  • పృథ్వీ రాజ్, అదితి బాల‌న్ ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం కోల్డ్ కేస్. త‌ను బాల‌క్ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రం జూన్ 30న అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల కానుంది.
  • తాప్సీప‌న్ను, విక్రాంత్ మాస్సే, హ‌ర్షవ‌ర్దన్ రానే ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం హ‌సీన్ దిల్ రుబా. ఈ సినిమా జులై 2న నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది.
  • క్రిస్ మెకే ద‌ర్శక‌త్వం వ‌హించిన ‘ద టుమారో వార్ ’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో జులై 2న విడుద‌ల కానుంది.
  • స‌మంతార్ సీజ‌న్ -2 .. తేజ‌స్వి పండిట్, సాయి టామ్ హంక‌ర్, స్వాప్నిల్ జోషి ప్రధాన పాత్ర న‌టించిన చిత్రం స‌మంతార్ సీజ‌న్ -2 ఈ వెబ్ సిరీస్ జులై 2న ఎమ్ ఎక్స్ ప్లేయ‌ర్ లోకి అందుబాటులోకి రానుంది.
  • ఫియ‌ర్ స్ట్రీట్ పార్ట్-1 … కియానా మ‌డేరియా, ఓలీవియా స్కాట్, బెంజిమ‌న్ ఫ్లోర్స్ జూనియ‌ర్ ప్రధాన పాత్రల్లో న‌టించిన చిత్రం ఫియ‌ర్ స్ట్రీట్ . జులై 2న నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల కానుంది.

About Author