విడిపోతున్నట్టు ప్రకటించిన హీరో ధనుష్, ఐశ్వర్య దంపతులు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వారు ఉమ్మడి లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 18 ఏళ్ల పాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకుని మా ప్రయాణం కొనసాగించామని లేఖలో పేర్కొన్నారు. ఇప్పడు తాము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్దమయ్యామని తెలిపారు. ఐశ్వర్య, తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నామని, వ్యక్తిగతంగా సమయం వెచ్చించాలని నిర్ణయం తీసుకున్నామని ధనుష్ తెలిపారు. తమ నిర్ణయాన్ని దయచేసి గౌరవించాలని కోరారు. ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు వ్యక్తిగత గోప్యత అవసరమని ధనుష్ లేఖలో పేర్కొన్నారు.