PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరోయిన్ ర‌కుల్ ఇంట్లో మంట‌లు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ప్ర‌ముఖ  హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంబైలోని ఈ బిల్డింగ్ లోని  12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంట‌నే మంటలను ఆర్పి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో రకుల్‌ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా మంటలు రాజుకోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు.

About Author