హిజాబ్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
1 min readపల్లెవెలుగువెబ్ : హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలోని కళాశాలలను తెరుచుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ సమస్య పరిష్కారమయేంత వరకు విద్యార్థులు తమ మతాచారాలను ప్రతిబింబించేలా ఎలాంటి దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది. కళాశాల విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నేడు విచారించింది. పిటిషన్‌ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. సమస్య పెండింగులో ఉన్నంత కాలం విద్యార్థులు మతపరమైన ఎలాంటి దుస్తులు ధరించరాదని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.