NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూతురుని కొట్టాడ‌ని.. స్కూల్ డైరెక్ట‌ర్ పై కాల్పులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజ‌స్థాన్ లోని భ‌ర‌త్ పూర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. స్కూల్ డైరెక్ట‌ర్ త‌న కూతురుని కొట్టాడ‌న్న కార‌ణంతో ఓ జవాన్ ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఏకంగా పాఠ‌శాల డైరెక్ట‌ర్ పై కాల్పులు జ‌రిపాడు. కన్వాడా గ్రామానికి చెందిన పప్పు గుర్జ‌ర్ కూతురు స్థానికంగా స్కూల్లో చ‌దువుతుంది. హోం వ‌ర్క్ చేయ‌లేద‌న్న కార‌ణంతో టీచ‌ర్ చెంపదెబ్బ కొట్టింది. విష‌యం తెలుసుకుని స్కూల్ డైరెక్ట‌ర్ ను ప‌ప్పు గుర్జ‌ర్ క‌లిశాడు. ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ప‌ప్పు గుర్జ‌ర్ స్కూల్ డైరెక్ట‌ర్ పై తుపాకీ ఎక్కుపెట్టాడు. వెంట‌నే కాల్చాడు. ఆప‌డానికి వ‌చ్చిన గుర్జ‌ర్ భార్య భుజానికి కూడ తుపాకి బుల్లెట్ త‌గిలింది. అనంత‌రం గుర్జ‌ర్ అక్క‌డ నుంచి పరారీ అయిన‌ట్టు పోలీసులు తెలిపారు.

                                   

About Author