హోళగుంద ధనాపురం రోడ్డు పనులు వెంటనే ప్రారంభించండి
1 min read
హొళగుంద న్యూస్ నేడు: హోళగుంద దానపురం రోడ్డు ప్రారంభించాలంటూ సీనియర్ టిడిపి నాయకుడు డిఎస్ భాష, మహమ్మద్ సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ మంత్రి మోల్య భరద్వాజ్ కు వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున రోడ్లు గుంతల మయంగా ఉన్నాయని వాహనాలు, ప్రజలు తిరగాలన్న అతి కష్టంగా ఉన్నదని ఆరోపించారు. దిన నిత్యం హోళగుంద మండలం నుండి వందల మంది ప్రజలు, రైతులు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారస్తులు తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారని వాపోయారు. వెంటనే కొత్త రోడ్డు పనులు ప్రారంభించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. రోడ్డు పనులు ప్రారంభిస్తే మండల ప్రజల రాకపోకలకు ఎంతో అనుకూలమవుతుందని అన్నారు. రోడ్డు అతుకులు గతుకులు, గుంతల మయంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడి తమ ఊర్లకు చేరుకుంటున్నారని ఆవేదన చెందారు. రోడ్డు మరమ్మతు చేసి ప్రజల రాకపోకలకు సులభం చేయాలనీ సబ్ కలెక్టర్ మంత్రి మోర్యభానుద్వార్, ఆర్ అండ్ బి డి ఈ వెంకటేశ్వర్లకు విజ్ఞప్తి చేశారు. సబ్ కలెక్టర్ సమాధానం ఇస్తూ రోడ్డు పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ప్రజలను రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొన్నారు.