ఇళ్ల ధరలు 30 శాతం పెరగొచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఈ ఏడాది ఇళ్ల ధరలు 25 నుంచి 30 శాతం పెరగొచ్చని క్రెడాయ్ పేర్కొంది. ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు అమాంతం పెరగడంతో ఆ ప్రభావం ఇళ్ల ధరల పై పడే అవకాశం ఉందని క్రెడాయ్ తెలిపింది. క్రెడాయ్ నిర్వహించిన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. కరోన మూడో దశ నివారణకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని , ఆర్థిక వ్యవస్థ పై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్రెడాయ్ అధ్యక్షుడు హర్షవర్ధన్ పటోడియా తెలిపారు. కరోన కారణంగా ఇప్పటికే 39 శాతం అమ్మకాలు ఆన్ లైన్ లోనే సాగుతున్నాయని తెలిపారు.