వాల్మీకి నాయకులకు సన్మానం!!
1 min read
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు విజయవాడ వాల్మీకి (బోయ) సేవ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నగరంలోని భీమనవారి పేటలోని మహర్షి వాల్మీకి భవన్ నందు కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య, అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, అనంతపురం డిసిసిబి చైర్మన్ లిఖిత, అలాగే రాష్ట్రంలో వివిధ కీలక పదవుల్లో ఉన్న వాల్మీకి నాయకులను సన్మానించారు.
