ఆకతాయిలు పొలాలకు నిప్పు- విద్యుత్ కు అంతరాయం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని చినమాచు పల్లె గ్రామ పొలాలలో పొలాలకు కొందరు ఆకతాయిలు అగ్గిపెట్టడం వల్ల అగ్గి మంటలు చెలరేగి 33 కెవి లైన్ల కింద అలాగే చుట్టుపక్కల వ్యాపించి విపరీతమైన ఉష్ణోగ్రత చెందడం వల్ల 33 కెవి ఇన్సులేటర్లు అన్నియు పగిలిపో వడడం జరిగిందని ట్రాన్స్కో ఏఈ రామలింగారెడ్డి తెలిపారు, సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సోమవారం ఉదయం 10 గంటలకు చిన్నమాచుపల్లె పరిధిలోని పంట పొలాల్లో కొంతమంది ఆకతాయిలు అగ్గిపెట్టడంతో పంట పొలాల్లోని చుట్టుపక్కల మంటలు చెలరేగి అక్కడే ఉన్న 33 విద్యుత్ లైన్లకు అలాగే విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించడం వల్ల అదేవిధంగా విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల 33 కెవి విద్యుత్ లైన్ల ఈగలు సాగిపోయి విద్యుత్ సరఫరాలో తీవ్రమైన అంతరాయం ఏర్పడిందని ఆయన తెలిపారు, తమకు విషయం తెలియగానే తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసి కాలిపోయిన తీగలను సరి చేయడంతో పాటు విద్యుత్తుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ మధ్యాహ్నం రెండున్నర గంటలకు విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు.