PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గర్భిణీ స్త్రీలను ప్రసవానికి ముందే ఆసుపత్రిలో చేర్పించండి

1 min read

– వడదెబ్బ బారిన పడకుండా ఉండేటట్టు ప్రజలకు అవగాహన కల్పించండి.
– ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ ద్వారా గ్రామంలో ప్రతి కుటుంబం దర్శించండి.
– జిల్లా ఆరోగ్య వైద్య అధికారి రామగిడ్డయ్య.
పల్లెవెలుగు వెబ్ ఆదోని : గర్భిణీ స్త్రీలను ప్రసవానికి ముందే ఆసుపత్రిలో చేర్పించేలా చర్యలు గైకొనాలని జిల్లా వైద్య అధికారి రామ గిడ్డయ్య శిక్షణా తరగతులకు హాజరైన ఏఎన్ఎం లకు, హెల్త్ సూపర్వైజర్లకు ఆదేశించారు.శుక్రవారం ఆదోని పట్టణం లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, సిల్వర్ జూబ్లీ హల్ నందు ఆవరణంలో ఆదోని డివిజన్ లోని ఏఎన్ఎం లు, హెల్త్ సూపర్వైజర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా ఆరోగ్య వైద్య అధికారి రామ గిడ్డయ్య పాల్గొన్నారు.జిల్లా ఆరోగ్య వైద్య అధికారి మాట్లాడుతూ…గర్భిణీ స్త్రీలను ప్రసవానికి ముందే ఆసుపత్రిలో చేర్పించాలని గర్భిణీ స్త్రీల వివరాలను మరియు వారికి అందిస్తున్న సేవలను ఆర్సిహెచ్ ఫార్మేట్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. అనీమియా మానిటరింగ్ టూల్స్ యాప్ నందు గర్భవతులు మరియు కిషోర బాలికలు వారికి నిర్వహించిన రక్త పరీక్షల వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా శస్త్ర చికిత్స చేయించుకున్న వారిని ఫాలో అప్ చేస్తూ వారికి మెడిసిన్ అందేలా చర్యలు గైకొనాలన్నారు. సిడి మరియు ఎన్సిడి సర్వేను 100% పూర్తి చేయాలన్నారు. గర్భిణీ స్త్రీలకు 16 సంవత్సరాలు లోపల ఉన్న పిల్లలందరికీ 100% టీకాలు వేయాలన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఎస్డిజి గోల్ సాధనకు గాను ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలన్నారు. స్త్రీలు చిన్న వయసులోనే గర్భం దాల్చకుండా ఉండుట కొరకు బాల్యవివాహాలను అరికట్టే విధంగా సచివాలయాల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయాలలోని హెల్త్ వర్కర్లు, సచివాలయ పరిధిలో నూతన దంపతులను కలిసి వారి ఆరోగ్య విషయంపై ఆరా తీయాలని స్త్రీలు గర్భం దాల్చినట్లయితే వారి వివరాలను అప్లోడ్ చేసి ప్రతి నెల వారి దగ్గరకు వెళ్లి రక్త పరీక్షలు చేస్తూ అవసరమైన వారికి ఐరన్ మాత్రలు ఇస్తూ గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిచ్చేలా చూడాలని ప్రసవం అనంతరం 42 రోజులు ఆరోగ్యం పై దృష్టి ఉంచాలని శిశువులకు ఇమినైజేషన్ టీకాలు కూడా ఇవ్వాలన్నారు.0-5 సంవత్సరాల పిల్లలు అంగన్వాడి సెంటర్ లో ఉండేలా చూడాలని, బరువు తక్కువ పిల్లలకు పోషకాహార పదార్థాలు అందేలా చూడాలని సదస్సుకు హాజరైన సిబ్బందిని ఆదేశించారు.ప్రస్తుతం వేసవి కాలంలో ఉన్నం కాబట్టి వడ దెబ్బ తగలకుండా ఉండేందుకు ప్రతి రోజు ఎక్కవ మోతాదు తో మంచి నీరు తీసుకొని, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తీసుకోని లేత లేదా, తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి, టోపీ పెట్టుకొని ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని వడదెబ్బ బారి నుండి తప్పించుకోవచ్చు అన్నారు. ఒకవేళ ఒక వ్యక్తికి వడదెబ్బ తగిలిన ఎడల ఆ వ్యక్తికి మొదటగా ప్రథమ చికిత్సగా కొబ్బరినీళ్ళ, నిమ్మకాయ నీళ్లు, ఉప్పునీరు వీటిలో ఏదైనా ఒకటి వారికి తాకిచ్చి ఒళ్లంతా తడి బట్టతో తడి బట్టతో తుడచి వెంటనే ఆసుపత్రి తీసుకువెళ్లేతట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలో వడదెబ్బ గురుంచి అవగాహణ కల్పించాలన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ మన రాష్ట్రం లోనే ప్రారంభమైంది. జిల్లాలో 108 అంబులెన్స్ 40 వాహనాలు ఉన్నాయి ప్రతి నెలకు రెండు సార్లు చొప్పున ప్రతి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ పర్యటించి ప్రతి కుటుంబాన్ని దర్శించి ఆరోగ్యo పట్ల వారి యొక్క హెల్త్ ప్రోగ్రెస్ తనిఖీ చేయాలన్నారు. బి.పి, మధుమేహం, రక్త హీనత, ఇతర దీర్ఘకాలిత వ్యాధులతో బాధపడుతున్న వారికి వారి ఇంటి దగ్గరికే ఫ్యామిలీ డాక్టర్ విధాన ద్వారా మందుల అందజేయాలన్నారు. ఒకవేళ సమస్య తీవ్రమైతే వారిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్.ప్రవీణ్,DPMO డాక్టర్ ఉమా,RBSK డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ హేమలత, ఫ్యామిలీ ఫిజీషియన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్.బాల మురళి,DPO విజయరాజు,SO హేమ సుందరం, డెమో శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.

About Author