NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇళ్ల నిర్మాణం..వేగవంతం కావాలి

1 min read
మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

మాట్లాడుతున్న కలెక్టర్​ జి. వీరపాండియన్​

నవరత్నాలతో.. అందరికీ ఇల్లు
– ఈ నెల 7 లోపు మ్యాపింగ్​, జియో ట్యాగింగ్​, రిజిస్ర్టేషన్​ .. అన్నీ పూర్తి కావాలి
– కలెక్టర్ జి. వీరపాండియన్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అధికారులందరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్​ జి. వీరపాండియన్​ సూచించారు. బుధవారం కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో నవరత్నాలు.. పేదలందరికీ ఇల్లు గ్రౌండింగ్​ హౌసింగ్​ ప్రోగ్రాం పనుల పురోగతి పై స్పెషల్ ఆఫీసర్, హౌసింగ్ ఈఈలు, డిఈలు, ఏఈలతో జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామ సుందర్ రెడ్డి, హౌసింగ్ పిడి వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ సిహెచ్ విద్యాసాగర్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్ ఈ కే.శివప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీలు చేపడుతున్న ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్, జాబ్ కార్డ్ మ్యాపింగ్ సంబంధించిన పనులన్నీ ఈ నెల 7వ తేదీ లోపు వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అన్ని లేఅవుట్లలో ఈ నెల 10వ తేదీలోగా మోడల్ హౌస్ నిర్మించాలన్నారు. హౌసింగ్ గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వంద శాతం పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయం చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను అధిగమించలన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఏ మాత్రం అలసత్వం వహించకూడదని అలా జరిగితే సహించేదే లేదన్నారు. అంతకుముందు మండలాల వారీగా హోసింగ్ ప్రోగ్రాం పై రివ్యూ నిర్వహించారు.

About Author