థర్డ్ డిగ్రీ ఇంకెన్నాళ్లు ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఆరేళ్లకు పైబడి శిక్షలు పడే కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తును తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమల్లో ఉందని తెలిపారు. ఆదివారం జాతీయ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో జరిగిన మొదటి స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు. ‘‘భారత శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టంలో సవరణలు చేయాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే.. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత.. ఆయా చట్టాల్లోని సెక్షన్లు భారతీయ ధృక్కోణంలో లేవు. స్వతంత్ర భారత కోణంలో ఈ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మేము న్యాయ నిపుణులు, ఇతర రంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఇది థర్డ్ డిగ్రీ కాలం కాదు. నేరస్థులూ మన పౌరులే. థర్డ్ డిగ్రీతో కాకుండా.. సైంటిఫిక్ ఆధారాలతో వారికి శిక్ష పడేలా చేయాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.