దేశంలో మరణ శిక్ష ఎంత మందికి పడింది అంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : నేషనల్ లా యూనివర్సిటీ డెత్ పెనాల్టీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ప్రకారం, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఐదు వేల మందికి పైగా దోషులకు మరణశిక్ష విధించారని రాజ్యాంగ నిపుణుడు విరాగ్ గుప్తా భాస్కర్‌లో ప్రచురించిన ఒక కథనంలో పేర్కొన్నారు. అయితే వీరిలో చాలా తక్కువ మందికే ఉరిశిక్ష అమలయ్యింది. పలు చట్టపరమైన ప్రక్రియల కారణంగా చాలా మంది దోషులకు ఇంకా ఉరిశిక్ష అమలుకాలేదు. ఇప్పటివరకు 1,414 మందిని మాత్రమే ఉరి తీశారు. దేశంలో మొదటి ఉరిని 1947, సెప్టెంబరు 9 న జబల్‌పూర్ సెంట్రల్ జైలులో అమలు చేశారు. నిర్భయ కేసులో నలుగురు దోషులకు 2020 మార్చి 20న తీహార్ జైలులో చివరిగా ఉరిశిక్ష విధించారు. ఎన్సీఆర్బీ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో డిసెంబర్ 2020 వరకు 442 మంది ఖైదీలకు మరణశిక్ష విధించారు. వారిలో 29 మందిని కోర్టు.. జీవిత ఖైదుగా మార్చింది. 413 మంది ఖైదీలను ఇంకా ఉరితీయాల్సి ఉంది అని సమాచారం.