PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యుత్ బకాయిలను మేమెలా చెల్లించాలి

1 min read

– కలెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతామన్న సర్పంచులు
పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: మండలంలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం నిధులు జమ అయ్యాయి.మేము గ్రామ అభివృద్ధికి లక్షల కొద్ది ఖర్చు చేశాము మేము పెట్టిన కర్త అంతా వచ్చిందని గ్రామ సర్పంచులు సంబరపడ్డారు.తీరా పంచాయతీలలో జమ అయిన నగదు చూస్తే చేసింది లక్షల్లో వచ్చింది గోరంత అంటూ సర్పంచులు కృంగిపోక తప్పదని తెలిసింది. పంచాయతీకి వచ్చిన నిధులలో 50 శాతం నిధులు ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న విద్యుత్ బకాయిలను మేమెలా కట్టాలంటూ మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ,ఈవోఆర్డితో మండలంలో ఉన్న సర్పంచులు మొరపెట్టుకున్నారు.గ్రామాల్లో మీరు ఏపని చేయమంటే ఆపని చేస్తున్నాం.లక్షల్లో అప్పుచేసి గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నాం.మేము గ్రామ సర్పంచ్ గా అయిన తర్వాత విద్యుత్ బిల్లులు అయితే కడతాం ఎప్పటినుంచో కొన్ని ఏళ్ల తరబడి ఉన్నా విద్యుత్ బకాయిలను అప్పటి సర్పంచ్ లతో విద్యుత్ శాఖ అధికారులు బిల్లులు కట్టించుకోకుండా ఇప్పుడు మేము కట్టాలంటే ఏవిధంగా కట్టాలి అంటూ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా ఒక గ్రామ పంచాయతీకి వందలు కాదు,వేలు కాదు,లక్షల కొద్ది 20,30,80లక్షల దాకా విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నాయి.ఇదే కాక ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి,రెండు విద్యుత్ మీటర్లు ఉంటే విద్యుత్ శాఖ అధికారుల లెక్కల ప్రకారము మూడింతలకు పైగా విద్యుత్ మీటర్లు ఉన్నట్టు లెక్కలు ఈవోఆర్డి చెప్పడంతో సర్పంచులు అందరూ విస్తుపోయారు.మాగ్రామ పంచాయతీకి ఉన్నది 1,2,3 విద్యుత్ మీటర్లు ఉన్నాయని గ్రామాల సర్పంచులు అంటున్నారు.ఈవిషయంపై మీరు జిల్లా అధికారులు విద్యుత్ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపిడిఓ,ఈఓఆర్డి సర్పంచులకు తెలపడంతో జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతామని ఆయా గ్రామాల సర్పంచులు అన్నారు.ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఫని భూషణ్ రెడ్డి,నాగ స్వామి రెడ్డి,రామస్వామి రెడ్డి,చంద్రశేఖర రెడ్డి,మర్రి రామచంద్రుడు,వెంకటేశ్వర్లు,జీవరత్నం,మదార్ సాహెబ్,కురువ ఎల్లయ్య,తిమ్మారెడ్డి,జగన్ మోహన్ రెడ్డి,అయ్యన్న పాల్గొన్నారు.

About Author